Monday 22 July 2013

Free Download of సూటిగా.... చూడకు Telugu from Ishq


సూటిగా.... చూడకు సూదిలా.... నవ్వకు
ఎదురుగ నిలబడుతూ ఎదనే.... తినకు
నడుమును మెలిపెడుతూ ఉసురే.... తియ్యకు
సొగసే... సెగలే... పెడితే చెదరదా... కునుకు
సూటిగా.... చూడకు సూదిలా.... నవ్వకు

నింగిలో మెరుపల్లె తాకినది నీ కలా....
నేలపై మహరాణి చేసినది నన్నిలా....
అంతఃపురం సంతోషమై వెలిగిందిగా.....
అందాలనే మించే అందం అడుగేయగా.....
అంతా నీవల్లే నిమిషంలో మారిందంటా
బంతి పువ్వల్లే నా చూపే విచ్చిందంటా
సూటిగా.... చూడకు సూదిలా.... నవ్వకు

సీతా కల్యాణ వైభోగమే రామా కల్యాణ వైభోగమే
గౌరీ కల్యాణ వైభోగమే లక్ష్మీ కల్యాణ వైభోగమే (వైభోగమే)
గంటలో మొదలైంది కాదు  భావనా....
గత జన్మలో కదిలిందొ ఏమో మన మధ్యనా....
ఉండుండి నా గుండెల్లొ  ఎదురేమిటో....
ఇందాకిలా ఉందా మరి ఇపుడెందుకో....
నీలో  ఆశే కలకాలం జీవించాలి
నీతో జన్మంతా  రోజల్లే ఉండాలి
సూటిగా.... చూడకు సూదిలా.... నవ్వకు
ఎదురుగ నిలబడుతూ ఎదనే.... తినకు
నడుమును మెలిపెడుతూ ఉసురే.... తియ్యకు
సొగసే... సెగలే... పెడితే చెదరదా... కునుకు
సూటిగా.... చూడకు సూదిలా.... నవ్వకు


No comments :

Post a Comment